Chandrababu:టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అరెస్ట్

20
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో భాగంగా నంద్యాలలో ఉన్న చంద్రబాబును ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కిల్ డెలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌ మెంట్ ప్రాజెక్టు వెలుగులోకి లోకి వచ్చింది. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,356 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతంగా ఉంది. దీంతో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్‌ విచారణ చేపట్టగా 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది.అనంతరం ఈ కేసును 2021 డిసెంబర్‌ 9న సీఐడీకి బదిలీ చేశారు. ఇక రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ఊహించినట్టుగానే ఆయన్నే అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:KTR:ఘనంగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

- Advertisement -