టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్టీఆర్ పేరు ప్రచారంలో లేకుండా చంద్రబాబు తిరిగి మళ్లీ అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిపిన వీడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అని రాధాకృష్ణ…చంద్రబాబును అడుగగా వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది…
రాధాకృష్ణ :ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు?
చంద్రబాబు : వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా..
రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.
చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి)
రాధాకృష్ణ : ఆ ఓకే.
చంద్రబాబు : ఎన్టీఆర్… పేరు మార్చాలి.
రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా అని అడుగగా చంద్రబాబు ఓకే చెప్పారు.
ప్రస్తుతం వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.