తారకరత్న మరణం.. చంద్రబాబు హైడ్రామా!

46
- Advertisement -

సినీ నటుడు నందమూరి తారకరత్న తాజాగా ( ఫిబ్రవరి 19 ) మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భౌతీక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిమ్ ఛాంబర్ లో ఉంచగా, మద్యాహ్నం 3:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఊంచితే తారకరత్న మరణంపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మి పార్వతి చేసిన సంచలన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తారకరత్న అకాల మరణం ఎంతో భాదకరం అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు ” లక్ష్మి పార్వతి.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఆ తరువాత ఆమె చేసిన వ్యాఖ్యాలే పోలిటికల్ హిట్ పెంచుతున్నాయి..

తారకరత్న మరణాన్ని చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. తారకరత్న కు గుండెపోటు వచ్చినప్పుడే బ్రెయిన్ డెడ్ అయిందని, వైద్యులు ఆ విషయాన్ని అప్పుడే ధృవీకరించినప్పటికి చంద్రబాబు, బాలకృష్ణ.. తారకరత్న మరణవార్తను బయటకు ప్రకటించలేదని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. లోకేశ్ పాదయాత్రకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఇరవై రోజుల తరువాత తారకరత్న మరణవార్తను ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఇదంతా కూడా చంద్రబాబు కుట్రలో భాగమే అని ఆమె చెప్పుకొచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ ను ఈనాడు తారకరత్న మరణాన్ని తన స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు వాడుకుంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు, మరియు ఆయన కొడుకు లోకేశ్ రాష్ట్రనికి పట్టిన పీడ అని.. వారి స్వార్థం కోసం ఇంకెంతమందిని బలి తీసుకుంటారో అని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. గత నెల 27న నారా లోకేశ్ కుప్పంలో పాదయాత్ర ప్రాంరంభించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న నందమూరి తారకరత్న హటాత్తుగా గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -