యువ నిర్మాత నాగ వంశీ అప్రత్యాశితంగా కొత్త సినిమా ప్రకటించారు. ఈసారి ప్రేమకథా గాథ కానీ, యాక్షన్ డ్రామా కానీ కాదు, హనుమంతుడి ఆధారంగా రూపొందుతున్న పురాణకథ.
ప్రాజెక్ట్‌ను ప్రి-లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ “వాయుపుత్ర”గా రీవిల్ చేయగా తండెల్ విజయంతో సరికొత్త ఊపులో ఉన్న చంద్రూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
చాలామంది ఆయన తర్వాతి చిత్రం కార్తికేయ 3 అవుతుందని భావించినా, చంద్రూ మొండేటి మాత్రం వాయుపుత్రను ఎంచుకున్నారు. దసరా 2026లో రిలీజ్ కానుంది. మహావతార్ నరసింహ ఘనవిజయం నాగ వంశీని పురాణాధారిత యానిమేషన్ చిత్ర నిర్మాణానికి ప్రేరేపించినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రం పూర్తిగా యానిమేషన్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. 2D మరియు 3D ఫార్మాట్లలో, పలు భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!

