ఫలించిన చేప జోస్యం..ఓడి గెలిచిన ట్రంప్

185
‘Chanakya’ Predicts Donald Trump’s Win
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా ముందుకెళ్లిన ట్రంప్‌ మొదటి నుంచి తన తడాఖా చూపించాడు. అసలు ఒక దశలో పార్టీలోనే గెలిచి బయటకు రాలేడని భావించిన మన బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఏకంగా వైట్ హౌజ్ లో అడుగుపెట్టాడు. మనీ పవర్ అండ్ మౌత్ పవర్ తో బండి ఇక్కడి దాకా లాక్కొచ్చాడు. సర్వేలన్ని హిల్లరీకే అనుకూలంగా ఉన్నాయని వెల్లడించిన…ఫలితాలను తారుమారు చేస్తూ శ్వేతసౌధం రారాజుగా ఎన్నికయ్యాడు.

అయితే,కొన్ని సర్వేలు మాత్రం ట్రంప్ గెలుపును ముందె ఉహించాయి.90 శాతం హిల్లరీ వైపు మొగ్గు చూపుతున్నారని ఎన్నికలకు ముందు సర్వేల్లో వెల్లడైంది. అయితే, దానికి అనుగుణంగానే తొలి ఫలితం వెలున్యూ హ్యాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌లో పోలింగ్‌ పూర్తయి ఫలితం వచ్చింది. ఇక్కడి ఎనిమిది ఓట్లలో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు ఓట్లు గెలుచుకున్నారు. దాదాపు సర్వేలన్నీ హిల్లరీదే విజయమని చెబుతుంటే ‘చాణక్య’ అనే చేప మాత్రం ట్రంప్ గెలుస్తారని వెల్లడించింది.

‘Chanakya’ Predicts Donald Trump’s Win

చాణక్య చిన్న చేప. చేపల ప్రేమికుడు ఆర్ వరుణ్ దీనిని ఇష్టంగా పెంచుకుంటున్నారు. గతంలో ఇది చెప్పిన జోస్యాలన్నీ చాలా వరకు నిజమయ్యాయట. ప్రస్తుతం అమెరికా ఎన్నికలు ఆసక్తి రేపడంతో గెలిచేది ఎవరో తెలుసుకునేందుకు చాణక్యను ప్రయోగించారు. ఓ నీటి తొట్టెలో హిల్లరీ, ట్రంప్ ఫొటోలను పెట్టారు. అంతే చాణక్య వేగంగా ఈదుకుంటూ వెళ్లి ట్రంప్ ఫొటోను పట్టుకుంది. దీంతో ట్రంప్ గెలుపు ఖామని తేలిపోయిందంటున్నారు. చైనాలోని షియానో ఎకోలాజికల్ పార్క్ కు చెందిన ఓ కోతి.. డొనాల్డ్ ట్రంప్ ఫొటోపై ముద్దు పెట్టి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని చెప్పింది.

‘Chanakya’ Predicts Donald Trump’s Win

గతంలో ఈ చాణక్య చేప చెప్పిన పలు జోస్యాలు కూడా నిజమయ్యాయి. యూరోకప్‌లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ గెలుస్తుందని చెప్పింది. అది నిజమైంది. 2015లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లోనూ అది చెప్పిన జోస్యం నిజమైంది. తాజాగా ట్రంప్‌ విషయంలోనూ చాణక్య సర్వే నిజమైంది.

- Advertisement -