యాక్షన్ చిత్రాలతో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్, అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘చాణక్య’ ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ‘తిరు’ ఈ సినిమాను తెరకెక్కించారు.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్‌గా స్పందించినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఇండో-పాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర దర్శక, నిర్మాతలకు సెన్సార్ సభ్యులు చెప్పారట. సినిమా హిట్టు అవుతుందని భరోసా ఇచ్చారట.

ఈ మువీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. అయితే, సినిమాలో ఓ కీ రోల్‌లో జరీన్ ఖాన్ నటించబోతోంది. తొలిసారి ఈ సినిమాతో జరీన్ దక్షిణాదిన అడుగు పెట్టబోతోంది. ఇక చాలా కాలంగా హిట్టు కోసం పరితపిస్తోన్న గోపీచంద్‌కు ‘చాణక్య’ హిట్ ఇస్తుందో లేదో వేచిచూడాలి.

