ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీ ఫైనల్‌కు చేరింది ఆస్ట్రేలియా. గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలలో 273 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గినప్పటికి అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల మ్యాచ్ ను రద్దు చేశారు.
డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతని ప్రకటించాలన్నా ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. మరో 7.1 ఓవర్ల మ్యాచ్ జరిగి ఉండే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటించేవారు. అయితే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలి సెమీ ఫైనల్ మార్చి 4న జరగనుండగా, రెండో సెమీ ఫైనల్ మార్చి 5న జరగనుంది.
Also Read:ప్రభుత్వంలో ఉన్నాం..పేదవాడి కోసం పనిచేయాలి

