మంత్రులు వారి ఛాంబర్ల వివరాలు..

207
- Advertisement -

తెలంగాణ మంత్రులకు సచివాలయంలో శాఖల వారీగా ఛాంబర్లను కేటాయించింది ప్రభుత్వం. భట్టి విక్రమార్క ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఎనర్జీకి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 10,11,12,ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాలుగో అంతస్తులోని 27,28,29 రూమ్‌లకు కేటాయించగా దామోదర రాజనర్సింహకు రెండో అంతస్తులోని 13,14,15 రూమ్‌లను కేటాయించారు.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5వ అంతస్తులోని 10,11,12 రూమ్‌లను,శ్రీధర్ బాబుకు 3 వ అంతస్తులోని 10,11,12 రూమ్‌లను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్ లోని 10,11,12 రూమ్‌లను,పొన్నం ప్రభాకర్‌కు 5వ అంతస్తులోని 27,28,29,కొండా సురేఖకు 4వ అంతస్తులోని 10,11,12 రూమ్‌లను కేటాయించారు.

సీతక్కకు ఫస్ట్ ఫ్లోర్ 27,28,29 రూమ్‌లను, తుమ్మల నాగేశ్వరరావుకు 3వ అంతస్తులోని 27,28,29 రూమ్‌లను,జూపల్లి కృష్ణారావుకు 4వ అంతస్తులోని 13,14,15 రూమ్‌లను కేటాయించారు.

- Advertisement -