యువ కథానాయకుడు నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి విజయాలతో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో తరువాత ఆ ఫాం కొనసాగించలేకపోయాడు.
లవర్ భాయ్ ఇమేజ్‌కు చేరువవుతున్న తరుణంలో వరుస ఫ్లాప్ లు ఎదురై కష్టాల్లో పడ్డాడు. సోలో హీరోగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి లాంటి సినిమా లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా మరోసారి సోలో హీరోగా సత్తా చాటేందుకు ‘ఛలో’తో వచ్చేశాడు నాగశౌర్య. అంతేకాదు దర్శకుడితో కలిసి నాగశౌర్య ఈ చిత్ర కథకు మెరుగులు దిద్దడంతో పాటు, సొంత నిర్మాణ సంస్థలో దాన్ని తెరకెక్కించడం విశేషం. మరి ‘ఛలో’తో నాగశౌర్య ఖాతాలో మరో సక్సెస్ పడిందో లేదో చూద్దాం.
కథ :
ఇద్దరు గొడవ పడుతుంటే చూసి తెగ ఎంజాయ్ చెయ్యడం హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచి ఇష్టం. గొడవలంటే చాలాఇష్టం. ఎవరినైనా కొట్టాలన్నా, కొట్టించుకోవాలన్నా మహాఇష్టం. ఇక హరి(నాగశౌర్య)పోకిరి చేష్టలకు విసుగెత్తిన తల్లిదండ్రులు హరిని తమిళనాడు సరిహద్దు ప్రాంతం ‘తిరుప్పురం’ అనే ఊళ్ళో ఉన్న వాళ్ల బంధువుల ఇంటికి పంపుతారు. తిరుప్పురం ఊరు ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది.
ఆ రెండు ఊళ్లకు అస్సలు పడదు. తెలుగు వాళ్లు, తమిళుల మధ్య పోరు సాగుతుంటుంది. హరి ఆ ఊరి కళాశాలలో చేరతాడు. అక్కడే కార్తీక(రష్మిక)ను చూసి ఇష్టపడతాడు హరి .కానీ హరిని కార్తీక ప్రేమించదు. కానీ ఆరెండు ఊళ్లని కలిపేందుకు కార్తీక ఊరు ఒక్కటిగా కలిస్తేనే తప్ప మన ప్రేమ గెలవదని మెలిక పెడుతుంది. మరి తన ప్రేమ కోసం హరి ఊరిని ఒక్కటిగా చేశాడా..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ విషయంలో ముందుగా నాగశౌర్య గురించి మాట్లాడుకోకతప్పదు. ఎదుటవారిని కొడుతుంటే ఆనందపడే పాత్ర గతంలో ఏ చిత్రంలోనూ రాలేదు. నాగశౌర్య ఆ పాత్రలో ఇమిడిపోయాడు. ఇక రెండు ఊళ్లను కలపడం చాలా సినిమాల్లో చూశాం. మొత్తంగా చూస్తే ‘ఛలో’ కథ చాలా చిన్న లైన్. అయితే, కథ ఎలా ఉందన్నది పక్కన పెడితే దాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో పాత్రను చాలా విభిన్నంగా రాసుకొన్నాడు దర్శకుడు. దాని చుట్టూనే ఫన్ జనరేట్ చేశాడు. కళాశాల సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి.
ప్రతీ సిచ్యూవేషన్ కు తగ్గట్లు కామెడీ పెట్టించడంతో సినిమా మొత్తం నవ్వులు పువ్వులు పూయిస్తుంది. హాయిగా నవ్విస్తాయి. హీరో-హీరోయిన్‌ల మధ్య సాగిన లవ్ ట్రాక్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఫస్టాప్‌లో పెద్దగా కథ లేకపోయినా, కామెడీ.. పాటలతో నడిపించాడు. మహతి స్వర సాగర్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లో ఒకటి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలుభారీగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
కాలేజ్‌లో హీరో ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. అప్పటివరకూ సరదాగా సాగిపోయిన సినిమా కాస్త సెకండ్ హాఫ్‌లో స్లోగా నడుస్తుంది. ఆ ఊరిలో రెండు వర్గాల మధ్య గొడవలేంటి తెలుసుకొని ఒక్కటిగా చేసే ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే పతాక సన్నివేశాలు కాస్త బలహీనంగా అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సినిమా మొదలవ్వడం ఆసక్తికరంగా మొదలవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. ఈ సినిమా కోసం తన శాయశక్తులా కృషి చేశాడు నాగశౌర్య.
ఎదుటవారిని కొడుతుంటే ఆనందపడే పాత్రలో నాగశౌర్య ఆ పాత్రలో ఇమిడిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. రష్మిక ప్రతి ఎమోషన్‌ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. నరేష్, అచ్యుత్ కుమార్, రాజేంద్రన్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలతో మెప్పించారు. సత్య, వైవా హర్షల కామెడీ బాగా పండింది. రఘుబాబు ప్రిన్సిపల్ పాత్రలో సూట్ అవ్వలేదు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహతి స్వర సాగర్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లో ఒకటి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలుభారీగా ఉన్నాయి.
తీర్పు:
నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే ఈ సినిమాను కుటుంబసమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆడియన్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఇక ఈ సినిమా కోసం తన శాయశక్తులా కృషిన నాగశౌర్య హిట్ సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.
విడుదల తేదీ:02/02/2018
రేటింగ్:2.5/5
నటీనటులు: నాగశౌర్య.. రష్మిక మందాన.. నరేష్.. వెన్నెల కిషోర్.. సత్య.. పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: వెంకీ కుడుముల