KTR:మార్చి 1న ఛలో మేడిగడ్డ

44
- Advertisement -

మార్చి 1న ఛలో మేడిగడ్డ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శిస్తామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. మేడిగడ్డతో పాటు అన్ని బ్యారేజీలను సందర్శించి కాళేశ్వరంతో జరిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

కాళేశ్వరంతో కాలువలు,చెరువులు నింపామని తెలిపారు.తెలంగాణకు నీళ్లు కావాలంటే ఎత్తిపోయాల్సిందేనని..ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోస్తే తప్ప తెలంగాణకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందన్నారు. సాగునీటి కోసం తెలంగాణ రైతులు దశాబ్దాలుగా పోరాటం చేశారన్నారు. నాడు కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిందన్నారు.

మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువ కాబట్టే అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించామన్నారు.తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం అన్నారు.తుమ్మడి హట్టి కంటే మేడిగడ్డ దగ్గరే నీటి లభ్యత ఎక్కువ ఉందన్నారు.మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగాయని తెలిపారు. దేశంలో అనేక ప్రాజెక్టులకు రిపైర్లు వస్తే వాటిని బాగు చేస్తున్నారని కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలకు వాడుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.తెలంగాణకు జీవధారగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామన్నారు. కాళేశ్వరం వల్ల పాడుబడ్డ ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిండుకుండలా మారిందన్నారు. కాళేశ్వరం ద్వారా వందల చెరువులు నింపామన్నారు. సిరిసిల్లలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు.అన్ని అనుమతులు వచ్చాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. కాపర్ డ్యాం నిర్మాణం ద్వారా మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లకు మరమ్మత్తులు చేయవచ్చన్నారు.

Also Read:8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

- Advertisement -