ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోన్న చలి..

51
- Advertisement -

ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో విమాన రాకపోకలపై పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ నుంచి వెళ్లే దాదాపు 50 డొమెస్టిక్ విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా ఢిల్లీ చేరుకోవాల్సిన మరో 18 డొమెస్టిక్ విమానాలు ఆలస్యంగా నడస్తున్నాయి.

నార్తర్న్ రైల్వే పరిధిలోనూ రైలు సర్వీసులపై పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపించింది. పొగమంచుతో వివిధ ప్రాంతాలకు వెళ్లే 36 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు రైల్వే అధికారులు.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్‌లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చలి, పొగమంచు దెబ్బకు ఈ నెల 15 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -