జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి ఆస్పత్రిలో చేరారు. 21న తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రక్తనాళాలలో కూడికలు ఉన్నాయని అందుకోసమే స్టంట్ కూడా వేసామని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని…ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు. చలాకి చంటి అనారోగ్యానికి గురయ్యారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు పై చంటి కుటుంబ సభ్యులు ఎక్కడ స్పందించలేదు.
Also Read:కోల్‌కతాపై చెన్నై ఘన విజయం
కొన్ని రోజుల పాటు పలు కారణాల వల్ల జబర్ధస్త్ కామెడీ షోకు దూరంగా ఉన్న చంటి.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కేవలం జబర్ధస్త్ లోనే కాకుండా పలు రియాలిటీ షోస్ లోనూ పాల్గొని చంటి ప్రేక్షకులను అలరించారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్ సిక్స్‌లోనూ అలరించారు.
Also Read:శరీరం చల్లబడాలంటే.. ఇలా చేయండి!