నితిన్…’పెద్దపులి’ రీమిక్స్

218
Chal Mohan Ranga Movie Songs
- Advertisement -

యంగ్ హీరో నితిన్, లై బ్యూటీ మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితిన్ 25వ సినిమాగా వస్తున్న మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

తాజాగా ఛల్ మోహన్‌ రంగ నుంచి ఊరమాస్ బీట్‌ సాంగ్‌ని విడుదల చేశారు. నువ్ పెద్దపులి.. నువ్ పెద్దపులి.. అంటూ పాపులర్ తెలంగాణ సాంగ్‌కి రీమిక్స్ వెర్షన్‌గా రూపొందించిన పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. తమన్ సంగీతం అందించగా ఈ పాటను రాహుల్‌ పాడారు. ఓ సారి ఈ పాటను మీరు వినండి..

https://youtu.be/aLce0YrMTsk

- Advertisement -