రివ్యూ: ఛల్ మోహన్ రంగ

269
Chal Mohan Ranga movie review
- Advertisement -

నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛల్ మోహన్ రంగ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రంతో నితిన్ మ్యాజిక్ చేశాడా..?నిర్మాతగా పవన్ సక్సెస్ కొట్టాడా లేదా చూద్దాం.

 కథ:

మెహన్ రంగ(నితిన్‌) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ మేఘాను చూసి లవ్‌లో పడతాడు. నితిన్‌ని కూడా ఇష్టపడుతుంది మేఘా. హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోకుండా ఓ కుదుపువస్తుంది. దీంతో ఇద్దరు ఎవరిదారి వారే చూసుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత వీరిద్దరు కలిసారా..?వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి..?అనేది చల్ మోహన్ రంగ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ త్రివిక్రమ్ డైలాగ్స్‌,కామెడీ,రొమాంటిక్ సీన్స్. హీరో నితిన్‌ మరోసాని తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. హాస్యం,రొమాంటిక్ సీన్స్‌లో చక్కని వెరియేషన్‌ను ప్రదర్శించాడు. ఇక లై బ్యూటీ మేఘా ఆకాష్ తన గ్లామర్‌తో సినిమా అట్రాక్షన్‌గా మారింది. ముఖ్యంగా నితిన్‌-మేఘా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మిగితా నటీనటుల్లో మధుమోహన్,రావు రమేష్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

nithiin chal mohan ranga

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాత కథ,పాయింట్ సెకండాఫ్. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌పై దర్శకుడు శ్రద్ద పెడితే బాగుండేది. కథ అంత బలమైనది కాకపోవడం,రోటిన్ అనిపిస్తుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించటం ఇబ్బంది పెడుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. నటరాజన్ సుబ్రమణ్యన్ పిక్చరైజేషన్ బాగుంది. లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించాడు. తమన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. పీకే క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

nithiin chal mohan ranga

తీర్పు:

లై సినిమా తర్వాత భారీ అంచనాలతో నితిన్ చేసిన సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రమ్ కథ అందించడం..పవన్ నిర్మాతగా మారడం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌లు,కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథలో బలం లేకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వేసవిలో నితిన్‌కు ఛల్ మోహన్ రంగ మంచి హిట్ ఇవ్వగా నిర్మాతగా పవన్‌ కూడా సక్సెస్ కొట్టాడు.

విడుదల తేది:05/04/2018

రేటింగ్:2.5/5

నటీనటులు:నితిన్,మేఘా ఆకాష్

సంగీతం:తమన్

నిర్మాత:పవన్

దర్శకత్వం:కృష్ణ చైతన్య

- Advertisement -