ఫిదా సినిమా ఎఫెక్ట్.. ఆగిన చైతూ సినిమా

197
nag chaitu
- Advertisement -

కృష్ణవంశీ దగ్గర అసోసియేట్ గా సౌజన్య అనే మహిళా దర్శకురాలు ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యింది. నాగ చైతన్యతో ఓ సినిమా ఓకే అయ్యింది. స్క్రిప్ట్ పనులు జరిగాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సౌజన్య చిత్రాన్ని నిర్మించబోతుందని వార్త వచ్చింది. కానీ ఈ సినిమా ఆగిపోయింది. కారణం.. ఫిదా సినిమాట.చేతి దాకా వచ్చింది నోటి దాకా రాకపోవడం అంటే ఇదే. ఎన్నాళ్లు గానో ఊరిస్తున్న డైరక్షన్ చాన్స్ వచ్చింది అనుకుంటే ఫిదా సినిమా వచ్చి దాన్ని వెనక్కు నెట్టింది.

సౌజన్య చెప్పిన కథ హారిక హాసిని బ్యానర్ వాళ్లకు బాగా నచ్చేసింది. నాగ్ చైతన్యకు చెప్పించారు. మంచి కథ కదా అని ఓకె అన్నాడు. కట్ చేస్తే, ఇంతలో ఫిదా సినిమా విడుదలయింది. తీరాచూస్తే, ఈ కథకు ఫిదాకు కాస్త సిమిలారిటీలు కనిపించాయి. పైగా ఈ కథకు ఫిదా మాదిరిగానే మాంచి పెర్ ఫార్మెన్స్ చేయగలిగిన హీరోయిన్ కావాలి. సాయి పల్లవినే తీసుకుంటే, మళ్లీ ఫిదాను చూసి, అలాంటి సినిమా తీసారన్న మాట వస్తుంది.

అందువలన ఇప్పట్లో ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని వినికిడి. సౌజన్య మరో కథను సిద్ధం చేసుకునే పనిలో వుంది. ప్రస్తుతం చైతు యుద్ధం శరణంతో బిజీగా వున్నాడు చైతు. ఈ సినిమా తర్వాత చందూ మెండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఆ తర్వాత సౌజన్య సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది

- Advertisement -