‘చైతు – శోభిత’… ఓ హోటల్ చెఫ్

25
- Advertisement -

నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పై గత కొన్ని రోజులుగా ప్రేమ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఎన్ని వినిపించినా వీరిద్దరూ ఇన్నాళ్లు తమ ప్రేమ గుట్టును రట్టు చేసుకోలేదు. కానీ, తాజాగా ఓ హోటల్ చెఫ్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారనే సంగతిని సాక్ష్యంతో సహా బయట పెట్టాడు. అసలు విషయంలోకి వెళ్తే.. లండన్‌లోని ఓ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే, విచిత్రంగా ఈ ఫోటో బ్యాక్‌ గ్రౌండ్‌ లో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని రుజువు అయిపోయింది.

రీసెంట్ గా వెకేషన్ కి వెళ్లిన ఈ ప్రేమ జంట ఇలా ఆ హోటల్ చెఫ్ తో ఫోటో దిగి మొత్తానికి అడ్డంగా దొరికిపోయారు. దాంతో ఈ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే, ఇంతవరకు ఈ వార్త పై అటు చైతు కానీ, ఇటు శోభిత కానీ స్పందించలేదు. కాకపోతే, తన ప్రేమ గురించి శోభిత ధూళిపాళ్ల గతంలో ఓ మాట చెప్పింది. కచ్చితంగా తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అని, ప్రేమ అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రేమలో తప్పులు చేయకుండా ఉండలేం అని చెప్పింది.

పై మాటాలను బట్టి శోభిత ధూళిపాళ్ల నిజంగానే నాగచైతన్యతో లవ్ లో ఉంది అని అర్థం అయిపోతుంది. పైగా తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అని శోభిత ధూళిపాళ్ల క్లారిటీ ఇచ్చింది. కాబట్టి చైతుతో శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఏది ఏమైనా శోభిత ధూళిపాళ్ల శైలి భిన్నం. శోభిత వ్యవహార శైలి విభిన్నం. బహుశా అందుకే కావొచ్చు.. చైతుకి బాగా కనెక్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -