- Advertisement -
ఈ మధ్యే ప్రేమించి ఇరువురి పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారు, చూడముచ్చటైన జంట, ఎందుకు సమంతా నాగచైతన్యపై కాంప్లయింట్ చేసిందని అనుకుంటున్నారా… అవును చేసింది. కానీ నిజంగా మాత్రం కాదు. ఓ షాపింగ్ మాల్ యాడ్ షూట్‌లో ఇద్దరు నటించారు.
బిగ్ బజార్ షాపింగ్ మాల్ యాడ్‌లో సమంతా కిచెన్‌లో వంట చేస్తూ ఉండగా అప్పడే నాగ చైతన్య వచ్చి తాను తెచ్చిన సామన్‌లో మిర్చి లేకపోవడంతో మిర్చి తేలేదని సమంతా వాల్ల అత్తకు ఫోన్లో కాంప్లెయింట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ బాస్కర్ ఈ యాడ్‌ను రూపొందించాడు. అయితే తాజాగా సమంత నటించిన రంగస్థలం సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మహానటి సినిమాలో సమంతా జర్నలిస్టుగా పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -