రకుల్‌తో మూవీ..చైతూ క్లారిటీ..

219
- Advertisement -

పెళ్లి తరువాత తిరిగి షూటింగ్ లతో బిజీ అయిన అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచితో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడనే వార్త టీ టౌన్‌లో పుకార్లు చేసింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా,వివాదాలకు దూరంగా ఉండే నాగ చైతన్య స్పందించారు. తనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ ట్వీట్ చేశాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయని అవన్నీ అవాస్తవాలే అని తెలిపాడు. అంతేగాదు రారండోయ్ వేడుక చూద్దాం సీక్వెల్‌ మూవీ రావడం లేదని ప్రస్తుతం తాను రకుల్‌తో ఏ సినిమాకు కమిట్ కాలేదన్నాడు.

Chaitu Clarifies on Next Movies

సర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌తో నిరాశ పరిచినా ఎన్టీఆర్‌తో జైలవకువ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొత్త మూవీలో చైతూ నటించనున్నాడని ప్రచారం జరిగింది. బాబీతో మూవీకి ఒకే చెప్పడంతో పాటు ‘నిన్ను కోరి’ ఫేం శివ ఇర్వాణ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్‌కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ షూటింగ్‌ ప్రారంభానికి కొన్ని రోజులు సమయం తీసుకుంటారని అప్‌డేట్స్‌ వచ్చాయి. అయితే వీటిలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -