ఇటు మళ్లీ పెళ్లి.. అటు మళ్లీ కలుస్తోంది?

43
- Advertisement -

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని రెండో పెళ్లి చేసుకుంటారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఇండియా టూడే కథనం వెల్లడించింది. చైతూ – శోభిత ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నారని.. వారి బంధం బలపడుతోందని ఆయన స్నేహితులు చెప్పారని పేర్కొంది. త్వరలోనే వారి రిలేషన్‌ను బహిర్గతం చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. దీంతో నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చైతు సన్నిహితులు వెల్లడించారు.

కానీ, చైతూ – శోభిత ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని గతంలో బాగా టాక్ నడిచింది. ఈ ప్రచారం అవాస్తవమని చైతు సన్నిహితులు ఎంత చెప్పినా.. చైతూ – శోభిత ధూళిపాళ్ల పర్సనల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం నెటిజన్లు ఇంకా మర్చిపోలేదు. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య మళ్లీ కలవనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత నాగచైతన్య ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడకుండా ఆర్చీవ్ చేసిన సమంత వాటిని తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చేలా చేసింది.

ఈ ఫొటోలను చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.ఏది ఏమైనా మళ్లీ కలవబోతున్న నాగచైతన్య, సమంత అంటూ హడావుడి జరుగుతుంది గానీ, మళ్ళీ కలిసే ప్రసక్తి లేదు అనేది వారి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్.

Also Read:రాజమౌళి … ‘మేడ్ ఇన్ ఇండియా’

- Advertisement -