చైతన్య రావు… ‘పారిజాత పర్వం’

17
- Advertisement -

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘నింగి నుంచి జారే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది

తాజాగా రంగ్ రంగ్ రంగీలా పాటని విడుదల చేశారు మేకర్స్. కంపోజర్ రీ ఈ పాటని ఫ్యాషినేటింగ్ క్యాచి క్లబ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ఆకర్షణీయంగా వుంది. ఈ పాటలో నటించిన శ్రద్ధా దాస్ స్వయంగా పాటని పాడటం విశేషం. శ్రద్ధా దాస్ వాయిస్, గ్లామరస్ ప్రజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.

బాల సరస్వతి కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.

Also Read:పెళ్ళికి సిద్ధమైన నిత్యా మీనన్

- Advertisement -