ఓటీటీలో ఆ రెండు సినిమాలదే హవా!

16
- Advertisement -

హిందీ చలన చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌కి కేరాఫ్‌గా మారింది ఛావా. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ – రష్మికా మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం రూ.516 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టడమే కాదు విమర్శకుల ప్రశంసలు పొందింది.

రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాగా ఛావా రికార్డులను బ్రేక్ చేసింది కోర్ట్. ఒకే రోజు ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రాగా మొదటి వారంలోనే 2.2 మిలియన్ వ్యూస్ ని అందుకున్నాయి. ఇందులో కోర్ట్ కు మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

- Advertisement -