రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం విడుదల..

107
gst

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు మరోసారి రుణాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా 8వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 6వేల కోట్ల రుణాల‌ విడుద‌ల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని రాష్ట్రాలకు క‌లిపి రూ. 48 వేల కోట్ల రుణం విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు తెలంగాణ‌కు రూ. 688.59 కోట్లు విడుద‌ల చేసింది కేంద్ర ప్రభుత్వం.