తెలంగాణలో 6 జాతీయ రహదారులు జాతికి అంకితం..

251
errabelli
- Advertisement -

తెలంగాణలో రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర గల 14 జాతీయ రహదారుల్లో 8 జాతీయ రహదారులకు భూమి పూజ చేసి, 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంత్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పాల్గొని పూర్త‌యిన 6 జాతీయ ర‌హ‌దారుల‌ను జాతికి అంకితం చేశారు. మిగ‌తా 8 ర‌హ‌దారుల‌కు శంకుస్థాప‌న చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

శంఖుస్థాపన చేసిన రోడ్ల వివ‌రాలు :
-నాలుగు లేన్ల రహదారి సూర్యాపేట – ఖమ్మం (58.62 కి.మీ పొడవు – 2 వేల 54 కోట్ల విలువ).
-నాలుగు లేన్ల రహదారి మంచిర్యాల – రేపల్లెవాడ (42 కి.మీ పొడవు – 1 వేయి 5 వందల 56 కోట్ల విలువ ).
-నాలుగు లేన్ల రహదారి రామ్ సాన్ పల్లె – మంగ్లూర్ (46.808 కి.మీ పొడవు – 1 వేయి 5 వందల 51 కోట్ల విలువ ).
-నాలుగు లేన్ల రహదారి కంది – రాం సాన్ పల్లె (39.98 కి.మీ పొడవు – 1 వేయి 3 వందల 4 కోట్ల విలువ ).
-నాలుగు లేన్ల రహదారి మంగ్లూర్ నుండి తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ వరకు (48.96 కి.మీ పొడవు – 1 వేయి 2 వందల 47 కోట్ల విలువ ).
-నాలుగు లేన్ల రహదారి రేపల్లెవాడ నుండి తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ వరకు (52.602 కి.మీ పొడవు – 1 వేయి 2 వందల 26 కోట్ల విలువ ).
-పునరావాసం మరియు అభివ్రుద్ది నకిరేకల్ – నాగార్జునసాగర్ (85.45 కి.మీ పొడవు – 3 వందల 69 కోట్ల విలువ )
-రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) కంకాపూర్ – ఖానాపూర్ రహదారి (21.10 కి.మీ పొడవు – 1 వంద 41 కోట్ల విలువ ).

జాతికి అంకితం ఇవ్వదలచిన రోడ్ల‌ వివరాలు :
-నాలుగు లేన్ల రహదారి యదాద్రి – వరంగల్ (99 కి.మీ పొడవు – 1 వేయి 8 వందల 89 కోట్ల విలువ).
-రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) నకిరేకల్ – తానంచెర్ల రహదారి (66 కి.మీ పొడవు – 6 వందల 5 కోట్ల విలువ).
-పునరావాసం మరియు అభివ్రుద్ది చేసిన ఓ.ఆర్.ఆర్. – మెదక్ రహదారి (62 కి.మీ పొడవు – 4 వందల 26 కోట్ల విలువ).
-రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) మన్నెగూడ – రావులపల్లి రహదారి (72 కి.మీ పొడవు – 3 వందల 59 కోట్ల విలువ).
-రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) ఆత్మకూరు – పస్ర రహదారి (34 కి.మీ పొడవు – 2 వందల 30 కోట్ల విలువ).
-రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) మహాదేవపూర్ – భూపాలపల్లి రహదారి (33 కి.మీ పొడవు – 2 వందల 6 కోట్ల విలువ).

- Advertisement -