కరోనా మహమ్మారి తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తున్నది అదే మంకీపాక్స్ వైరస్. దాదాపు 12 దేశాల్లో ఈ మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ కేంద్రం ముందుజాగ్రత్తగా చర్యలు చేపట్టింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబుకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
మంకీ పాక్స్ లక్షణాలు: జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం. అనుమానితులు ఎవరంటే..?: అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు.
చికిత్స: అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే దవాఖానలో చేర్చి ఐసొలేషన్‌లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.