కోవిడ్ మార్గదర్శకాల అమలుపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ..

223
- Advertisement -

కోవిడ్ మార్గదర్శకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన మార్గదర్శకాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో యక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని.. హై-పాజిటివిటీ రేటు ఉన్న చోట వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు. పండుగల సీజన్‌లో జనం సమూహాలుగా గుమికూడకుండా చూడాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో కోవిడ్-19 నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు.

ఐదంచెల కోవిడ్-19 వ్యూహాన్ని (టెస్ట్- ట్రాక్- ట్రీట్- వ్యాక్సినేషన్- కోవిడ్ గైడ్‌లైన్స్‌) ఫాలో అవ్వాలన్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా.. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశవ్యాప్తంగా చాలా పురోగతి ఉంది. అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా కార్యక్రమాన్ని కొనసాగించాల సూచించారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం, సర్వైలెన్స్ పై దృష్టి పెట్టాలి. నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలను ఆదేశించారు.

- Advertisement -