కేంద్ర బడ్జెట్… ఆదాయ పన్ను వివరాలు

380
nirmalagst
- Advertisement -

2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను చదవి వినిపించారు.  కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త ఆదాయ‌ప‌న్ను విధానాన్ని ప్ర‌క‌టించారు. ఆదాయపన్ను శ్లాబులో భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు 3 శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 6 శ్లాబులుగా విస్తరించారు.

రూ.0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదని తెలిపారు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు.

- Advertisement -