- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని నిర్ణయించింది.
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మంకీపాక్స్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకితే మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలే బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య 77శాతం పెరిగినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఐరోపా, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి. మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. 80శాతానికిపైగా కేసులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read:దేశంలో మరో మంకీపాక్స్ కేసు
- Advertisement -