హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. రీజనల్ ఆఫీస్ డైరెక్టర్ అనురాధ లీడర్ షిప్ లో మూడు రోజుల పాటు పర్యటించనుంది. టీంలో హేమ లత, శ్రీ ఠాకూర్, శేఖర్ చతుర్వేది ఉండగా తెలుగు స్టేట్స్ రీజనల్ ఆఫీస్ నుంచి చంద్ర శేఖర్ పర్యవేక్షిస్తున్నారు.
మొదటి రోజు గచ్చిబౌలిలోని కరోనా ఆసుపత్రి ,లేబర్ క్యాంప్‌ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సి ఏస్ తో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం హైదరాబాద్ సీపీ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్‌ను పరిశీలించనున్నారు.
రెండవ రోజు ఉదయం డీజీపీ ఆఫీస్,కంటైనమెంట్ జోన్ పరిశీలించనున్నారు. అనంతరం నేచర్ క్యూర్ ఆస్పత్రి పరిశీలన, మధ్యాహ్నం 3 గంటలకు మెహిదీపట్నం రైతు బజార్ తర్వాత మంగర్ బస్తీలో ఉన్న బస్తి దవాఖాన పరిశీలించనున్నారు.
మూడవరోజు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ పరిశీలించడం తర్వాత సీఎస్‌తో సమావేశం కానున్నారు. తర్వాత గాంధీ ఆస్పత్రితో పాటు ల్యాబ్‌ని పరిశీలించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ పయనం కానున్నారు.