హైదరాబాద్‌కు కేంద్ర బృందం..వరద నష్టంపై అంచనా

66
hyderabad rains

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్షణ సాయంగా రూ. 1350 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయడం,కేంద్రం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. క్షేత్రస్ధాయిలో పరిశీలిన చేసిన వరద నష్టంపై ఓ అంచనాకు రానున్నారు.

ఇప్ప‌టికే న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ సాయం కింద ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ. 550 కోట్ల సాయం ప్ర‌క‌టించారు. దీంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్లు, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం రూ. 2 కోట్లు ప్రకటించాయి.