45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

3
- Advertisement -

తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 19 ఇన్స్టిట్యూట్లకు రూ.61.6లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది.

విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి బీఎల్ వర్మ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read:బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన అల్లు అర్జున్‌

- Advertisement -