దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 142విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశాలకు గాను ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్ 5 నుంచి వారం రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ జగదీశ్‌కుమార్ తెలిపారు. జూన్5,6,7,8,9,10,11,12 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా..తదుపరి అప్‌డేట్‌ల కోసం ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోవాలని అన్నారు.
Also read: JAMMU:చిన్నారి కలను నెరవేర్చిన మోదీ..!
సీయూఈటీ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తో ముగియడంతో ఆ గడువును మరోసారి మే 5వరకు పొడగించిన సంగతి తెలిసిందే. మే 6,7,8 తేదీల్లో దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. త్వరలోనే అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు.
Also read: నేటితో నామినేషన్స్.. క్లోజ్ !