విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా : ఎన్సీపీ శరద్‌పవార్‌

30
margarate
- Advertisement -

విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్‌ అల్వాను తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉంచినట్లుగా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. గోవా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ గుజరాత్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్ 14న కర్నాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం అధికార ఎన్‌డీయే కూటమి తమ అభ్యర్థిగా జగ్‌దీప్‌ ధన్కడ్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది.

విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపట్ల మార్గరెట్‌ అల్వా ట్వటర్‌లో స్పందించారు.తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని…. విపక్షాల నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపట్ల విశ్వాసం ఉంచిన విపక్షాల నేతలందరికీ కృతజ్క్షతలు చెబుతున్నట్టు ఆమె ట్వీట్‌ చేశారు.

- Advertisement -