టీకాలపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్

148
covid
- Advertisement -

కరోనా నుండి కోలుకున్న వారు ఎప్పుడు వ్యాక్సినేషన్ వేసుకోవాలన్న దానిపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. కరోనా నుండి కోలుకున్న తర్వాత 3 నెలలకు టీకా తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు జాతీయ టీకా నిపుణుల క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

గతంలో కరోనా బారీన పడి కోలుకున్న వారు 4-8 వారాల మధ్య టీకా తీసుకోవాల్సి ఉండగా ఫ‌స్ట్ డోస్ తీసుకున్నాక క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయితే 3 నెల‌ల త‌ర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉండేది.

అలాగే తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందిన వారు టీకా కోసం 4 – 8 వారాలు వేచి ఉండాల్సి ఉండగా టీకా తీసుకున్న 14 రోజుల త‌ర్వాత ర‌క్త‌దానం చేయాలని సూచించింది. బాలింత‌లు కూడా టీకా తీసుకోవ‌చ్చని వెల్లడించింది.

- Advertisement -