కరోనా..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

107
covid
- Advertisement -

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రికార్డు స్ధాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతుండగా వ్యాక్సిన్తో పాటు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనే నిబంధన విధించింది కేంద్రం. అయితే తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది.

తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతీఒక్కరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దని ఐసీఎంఆర్ తెలిపింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు 12ఏళ్లు దాటిన పిల్లలంతా డబుల్‌ మాస్క్‌ వాడాలని సూచించింది. స్టెరాయిడ్స్ సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో వాడాలని తెలిపింది.

- Advertisement -