ఉద్యమంలా దూసుకుపోతున్న గ్రీన్ ఛాలెంజ్‌..

44

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియ ఛాలెంజ్‌లో పిలుపు మేరకు డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెంబర్ Dt మేరీ సూర్య పోగు డైటిసియన్ ఆధ్వర్యంలో డోర్నకల్ అధ్యక్ష మండల బిషప్ తండ్రి రైట్ రెవరెండ్ కొడిరెక్కల పద్మరావు,తల్లి విజయమ్మ, విశ్వం అయ్యాగారు, గడిదేసి ప్రభాకర్,సుకుమారి మొక్కలు నాటి, గర్భిణి స్త్రీలకు,బాలింతలకు పండ్లు పంచి,హరితహారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వృక్షో రక్షతి రక్షితః ఒకప్పుడు అశోకుడు దారికి ఈరు వైపులా మొక్కలు నాటి ప్రప్రంచం అంత తెలియజేశారు.ఇప్పుడు మన రాష్ర్టంలో రాజ్యసబ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మొత్తం మీద కొన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు. కాబట్టి ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

అలాగే హరితహరంతో కూడా సీఎం కేసీఆర్ ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కోట్ల మొక్కలు నటించి కార్యక్రమం తుచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. దానికి మన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి భారత దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వుండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చెట్లు ఎక్కడైతే ఎక్కువ వుంటాయో అక్కడ పాడి పంటలు చాలా బాగుంటాయి. అలాగే వాతావరణం కూడా బాగుంటుంది అని తెలిపారు.