- Advertisement -
రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర సర్కార్ షాకిచ్చింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని వెల్లడించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని వెల్లడించింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలకు పంపించింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. అయితే 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడాఖ్‌లలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులు జారీ చేయనుంది.దీంతో దేశంలోని మిగితా రాష్ట్రాలకు షాక్ తగిలినట్లైంది.
ఇప్పటివరకు జాతీయ హోదా లభించిన సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు సమకూరేవి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
- Advertisement -