కేంద్ర ప్రభుత్వం 22 యూట్యూబ్ ఛానళ్లకు షాకిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో ఈ యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించింది. దేశభద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లున్నాయి. దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా వీటిని నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.
కేంద్రం నిషేదం విధించిన ఛానళ్లు ఇవే..
ARP News, AOP News, LDC News, SarkariBabu, SS ZONE Hindi, Smart News, News23Hindi, Online Khabar, DP news, PKB News, KisanTak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul, दिनभरकीखबरें,
పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లు..
DuniyaMeryAagy, Ghulam NabiMadni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0

