త్వరలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయబోతుంది కేంద్ర సర్కార్. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ప్రకారం చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లితండ్రులకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారికి కేంద్రం షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించేలా వాహనాల చట్ట సవరణ బిల్లును సవరించింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.
దీంతో ఇకపై పిల్లలకు బండి ఇచ్చేవారికి 25 వేల రూపాయల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అటు మద్యం సేవించి వాహనం నడిపినా, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా 10 వేల రూపాయల ఫైన్ జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5 వేల రూపాయల ఫైన్ వేసేలా దీన్ని రూపొందించగా.. ఈ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హెల్మెట్ లేకుండా నడిపితే రూ.1000 జరిమానా మాత్రమే కాకుండా మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. రవాణా శాఖ ఇచ్చిన ఏ ఆదేశాలనైనా ఉల్లంఘించినట్లు తేలితే కనీసం రూ.2000 వసూలు చేస్తారు.