తెలంగాణ నుంచి ముగ్గురు ఉత్తమ టీచర్లు…

34
sarvepally
- Advertisement -

సరికొత్త బోధనా పద్ధతులతో పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటను నిర్మించే ఉపాధ్యాయులకు కేంద్ర విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేస్తుంది. భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆవార్డులను ప్రధానం చేస్తారు. రాధాకృష్ణన్‌ టీచర్‌గా పని చేశారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు, ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 5న ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.

2022కు గాను దేశవ్యాప్తంగా 46 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రకటించారు. అందులో తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు టీఎన్‌ శ్రీధర్‌, ములుగు జిల్లా అబ్బాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు కందల రామయ్య, నాచారం దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సునీతారావును ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేయనున్నారు.

- Advertisement -