ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన…ఉచిత రేషన్ పథకంను మరికోన్నాళ్లు కొనసాగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఉచిత రేషన్ పథకం సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుండటంతో…మరో మూడు నెలల పాటు అందించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఉచిత రేషన్ పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు బియ్యం, గొదుమలను ఉచితంగా పంపిణీ చేస్తారు. దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ.44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది. దీంతో డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు.