డీఏను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

114
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పంది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచనున్నట్టు ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది.

7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం మేర డీఏ పెంచింది. మరో సారి పెంపుతో మొత్తంగా అది 38 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు వలన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏను పెంచాల్సి ఉంటుంది. ఇందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖాజానాపై భారం పెరగనుంది.

- Advertisement -