- Advertisement -
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడిన కేటీఆర్…. మూతపడిన సీసీఐని తెరిపించడానికి కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న మంత్రి…. రాయితీలు ఇస్తామన్న పట్టించుకోవడం లేదన్నారు. సీసీఐని ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్న కేంద్రం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం మొండి వైఖరి మానుకోవాలని హితవు పలికారు. సిమెంట్ వినియోగం పెరిగి ప్రయివేటు పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
- Advertisement -