అసెంబ్లీలో నో సెల్‌ఫోన్స్‌..టీడీపీ నిరసన

84
tammineni
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొనగా ఇవాళ సభ ప్రారంభంకాగానే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం….టీడీపీ సభ్యుల ఆందోళనను కట్టడిచేసేందుకు సభలో సెల్ ఫోన్‌ అనుమతిలేదని తెలిపారు.

దీనిపై స్పీకర్‌ తమ్మినేని రూలింగ్‌ ఇచ్చారు. స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్‌తో రికార్డు చేసి టీడీపీ సభ్యులు మీడియాకు చేరవేస్తున్నారని తెలిపారు.

ఎవరి మనోభవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానం అని…సభ్యులంతా తమ సెల్ ఫోన్లను వాలంటరీగా సరెండర్ చేయాలని తెలిపారు.

- Advertisement -