అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

10
- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళి అర్పించారు. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్‌ రిజుజు, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, పియూష్‌ గోయల్‌, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళి అర్పించారు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్‌తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

Also Read:శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా

- Advertisement -