శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు..

32

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్టీవెన్స్ కంపెనీస్ ఛైర్మన్ ప్రకాష్ కే షా, నరసారావు పేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ చల్ల భగీరథ్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.