దిల్‌రాజు బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీల సందడి..

57
Dil Raju Birthday

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. నిర్మాతగానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా తనదైన ముద్ర వేసిన దిల్ రాజు ఈ రోజు 50వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఈయన బర్త్ డే పార్టీలో సందడి చేసారు. దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా హాజరైనట్లు తెలుస్తోంది. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారు. ‘దిల్ రాజు@50ఇయర్స్’ అనే పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో స్టార్స్ అందరూ సందడి చేశారు.

మెగా స్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో కలిసి ఉన్న ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలానే స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘కేజీఎఫ్’ దర్శక హీరోలు ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్ – పూజాహెగ్డే – రాశీఖన్నా తదితరులు సందడి చేశారు.

లాక్ డౌన్ కాలంలో సింపుల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దిల్ రాజు ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో తన సతీమణిని అందరికీ ఫార్మల్ గా పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఉన్న దిల్ రాజు దంపతులు పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దిల్ రాజు బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.