సెలబ్రెటింగ్ 10 ఇయర్స్ ఆఫ్ లెజెండ్..

28
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో మార్చి 28 న విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘లెజెండ్’ ను రిరీలిజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం ద్వారా ప్లజెంట్ సర్ ప్రైజ్ అందించారు.

రీ-రిలీజ్ ట్రైలర్‌లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమా ప్రిమైజ్ ని మరోసారి అద్భుతంగా చూపించారు. ఆ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా మారారు.

ఈ చిత్రానికి సంగీతం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించగా, సినిమాటోగ్రఫీ సి. రామ్ ప్రసాద్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు.మరో 5 రోజుల్లో థియేటర్స్ లో యాక్షన్ ధమాకా చూసేందుకు సిద్ధంగా ఉండండి!

Also Read:ఓం భీమ్ బుష్..వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -