రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

327
election comission
- Advertisement -

మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి చేరుకుంది. తాజ్ హోటల్‌లో రాజకీయ పార్టీలతో ఓపి రావత్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు.

టీఆర్ఎస్ నుంచి ఎంపీ వినోద్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్, జంధ్యాల , బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఆంటోనీ రెడ్డి, థామస్ బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నుండి చాడ వెంకటరెడ్డి, శ్రీనివాస్ రావు, సిపిఎం నుంచి నంద్యాల నర్సింహారెడ్డి, జే వెంకటేష్, వైఎస్ఆర్సిపి నుంచి సంజీవ్ రావు, రవి కుమార్, MIM నుంచి జాఫ్రీ , ముస్తాక్ హాజరయ్యారు.

ప్రలోభాలకు తావులేకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక విజిలెన్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు కోరారు. స్మార్ట్ సిటీస్ లో గతం నుండి పనులు జరుగుతున్నా వాటికి అడ్డుపడుతున్నారని ఈసీకి కంప్లయింట్ చేశామన్నారు టీఆర్ఎస్ నేత వినోద్. లా అండ్ ఆర్డర్ పై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు ప్రసంశిస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలను వారి దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

ఇక ఈ నెల 23వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో సమావేశమయ్యే కేంద్ర ఎన్నికల కమిషనర్లు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీఈవోలు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బుధవారం (24వ తేదీ) ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆదాయం పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల డీజీలతో, 11.15 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమై ఢిల్లీకి తిరిగివెళ్తారు.

- Advertisement -