హెలికాప్టర్ ప్రమాదం..11 మంది మృతి

49
plane

తమిళనాడులోని కూనూర్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్‌లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ,ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తుండగా ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు లభించాయని అధికారులు వెల్లడించారు.

ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ బుధ‌వారం న‌లూర్ నుంచి వెల్లింగ్ట‌న్‌కు వెళుతుండ‌గా ఈ ప్రమాదం చోటు చేసుకోగా హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది. ప్ర‌మాద ఘ‌ట‌నపై వాయుసేన ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.