Viral Video: యూపీలో దారుణం..షాకింగ్ వీడియో

3
- Advertisement -

రంజాన్ మాసం వేళ యూపీలో దారుణం చోటు చేసుకుంది. అలీగఢ్‌లోని తేలీపాడా ప్రాంతంలో గ్యాంగ్ వార్ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. రంజాన మాసం ఉదయం 3.30 గంటలకు సెహ్రీప్రార్థనలకు కొద్ది సేపటి ముందు రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు హరీష్ అలియాస్ కట్టా అనే వ్యక్తిని అతని ఇంటి సమీపంలోనే కాల్పులు జరిపి హతమార్చారు.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ముసుగులు ధరించిన దుండగులు హరీష్‌పై కాల్పులు జరిపి, అక్కడి నుంచి తప్పించుకున్నారు. హరీష్‌తో ఉన్న మరో వ్యక్తి కాల్పులు ప్రారంభమైన వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 7 బుల్లెట్లు హరీష్ కడుపు మరియు వెనుక భాగాన్ని తాకడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:TTD:వాల్మీకిపురం పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -